Bayyaram: కరెంటు కోతలపై భగ్గుమన్న అన్నదాత బయ్యారంలో రైతుల ధర్నా!

Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో కరెంటు కోతలపై నిరసన. సబ్ స్టేషన్ ఎదుట ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా, 8 గంటల నిరంతర విద్యుత్ సరఫరాకు డిమాండ్.

NARASIMHARAO, BAYYARAM
Published on: 11 Sept 2026 1:56 PM IST
Bayyaram
X

Bayyaram: కరెంటు కోతలపై భగ్గుమన్న అన్నదాత బయ్యారంలో రైతుల ధర్నా!

Bayyaram: మహబూబాబాద్ జిల్లాబయ్యారం వయ్యారం మండలంలోని కొత్తపేట గ్రామంలో సబ్ స్టేషన్ ఎదుట రైతులు,ఏఐకెఏంఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు, ఈ ధర్నాని ఉద్దేశించి రైతులు, నాయకులు మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వేసిన పంటలుఎండిపోతుండటంతో రైతుల ఆగ్రహం.

పేరుకు 24 గంటల ఉచిత విద్యుత్ అనిచెపుతున్న ప్రభుత్వం కనీసం 2 గంటల విద్యుత్ కూడా వ్యవసాయనికి ఇవ్వడం లేదని ప్రభుత్వ తీరును నిరసిస్తూ ధర్నా నిర్వహించామని అన్నారు, అప్రకటిత విద్యుత్ కోతలతో వేసిన పంటలు కండ్ల ముందే ఎండి పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.

కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని అగమ్య గోచారంగా పరిస్థితి తయారయిందని ఆవేదన. 24గంటలు కరెంటు ఇవ్వక పోయిన కనీసం 8గంటలైన నిరంతరాయంగా కరెంటు ఇవ్వాలని డిమాండ్.

గంట గంటకు కరెంటు ట్రిప్ అవుతుండటం వలన మోటార్లు కాలిపోయి నష్ట పోతున్నామని ఆవేదన. ప్రభుత్వం 24గంటల కరెంటు ఇస్తున్నామని పేరుకే తప్ప క్షేత్ర స్థాయిలో అమలు చేయడం లేదని ఆగ్రహం. ఇప్పటికైనా కనీసం 8 గంటల నాణ్యమైన నిరంతర కరెంటు అందించక పోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరిక.

ఈ కార్యక్రమంలో రైతులు, పార్టీ నాయకులు తదిరులు పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM