Julurupadu: జూలూరుపాడు సొసైటీ కేంద్రం ముట్టడి షరతులు వద్దు పంట కొనండి

Julurupadu: జూలూరుపాడులో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 8 May 2026 4:01 PM IST
Julurupadu
X

Julurupadu: జూలూరుపాడు సొసైటీ కేంద్రం ముట్టడి షరతులు వద్దు పంట కొనండి

జూలూరుపాడు: ఈరోజు జూలూరుపాడులో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంల కేంద్రాలలో అకాల వర్షాలకు తడుస్తున్నటువంటి వరి ధాన్యం మొక్కజొన్నలు తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సొసైటీ కొనుగోలు కేంద్రం ఎదుట జరిగిన ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాలలో వేలాది బస్తాలు ధాన్యం, మొక్కజొన్నలు ములుగుతోందని అన్నారు.

నిబంధనల మేరకు కొనుగోలు కేంద్రాన్ని తీసుకొచ్చిన పంటను తేమ శాతం ఎక్కువగా ఉందని, తాలు ఎక్కువగా, రంగు మారింది అంటూ అధికారులు పలు విధాలుగా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.. పంట వివరాలను నమోదు చేయడానికి యాప్ మూసివేశారని, దీనిపై అవగాహన లేక పంట వివరాలు నమోదు చేయలేదని తెలిపారు. అధికారులు రైతు యాప్ ను నిరంతరం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సక్రమంగా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారని అన్నారు. దీనిని అవకాశం గా తీసుకున్న పలువురు ప్రైవేట్ వ్యాపారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను నిలువునా ముంచుతున్నారని మండిపడ్డారు. ఒకవైపు అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు, మరోవైపు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి పంట నష్టం జరుగుతుందని అన్నదాతలు ఆగమాగం అవుతున్నారని, కొనుగోలు కేంద్రాల వద్ద రాత్రి పగలు లేకుండా వర్షం పడుతుందేమో అని కాపు కాయాల్సి వస్తుంది దీనివల్ల రైతులు కూడా ప్రమాదాలు బారిన పడే అవకాశం ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు సంక్షేమమే ధ్యేయమంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో ఘోరంగా విఫలం చెందుతుందని విమర్శించారు.. ఇకనైనా షరతులు లేకుండా రైతులు పండించిన మొత్తం పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల యావత్ రైతాంగాన్ని సమీకరించి ఆందోళన కు దిగుతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యాస రోశయ్య, ఎల్లంకి మధు తూము కోటయ్య సిరిపురపు వెంకటేశ్వర్లు గార్లపాటి వీరభద్రం ఎల్లంకి శీను వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU

Next Story