Kothagudem: కలెక్టర్ గారు చూడండి.. ఇల్లందులో దళారుల రాజ్యమేలుతోంది!
Kothagudem: ఇల్లందు మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఆందోళన.
Kothagudem: కలెక్టర్ గారు చూడండి.. ఇల్లందులో దళారుల రాజ్యమేలుతోంది!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఇల్లందు :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో అధికారురుపై రైతులు కన్నెర్ర చేశారు. నెల రోజులుగా రైతులు పండించిన మొక్కజొన్న కాటా పెట్టకుండా వ్యాపారుల సంబంచిన మొక్కజొన్న లకు కాటా లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులు పండించిన కష్టం కన్నీటి పాలు అవుతుందని, నెల రోజులుగా మొక్కజొన్నలు కాటా పెట్టకపోవడంతో కళ్ళం లోనే తడిసి ముద్దవుతున్న అధికారులు కనికరం చూపడం లేదని ఆరోపిస్తున్నారు. కొంత మంది రైతులు తీవ్ర దుఖంతో పీఏసీఏస్ అధికారులు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రేపల్లెవాడ, కొమరారం, ఇల్లందు మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అక్రమాలఫై జిల్లా కలెక్టర్ అంకిత్,ఎమ్మెల్యే కోరం కనకయ్య దృష్టి సారించాలని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.డబ్బులు ఇస్తేనే మొక్కజొన్నలకు కాటా పెడుతున్న దళారుల పై,అధికారుల పై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నారు.




