Kothagudem: బూర్గంపాడులో బీట్ ఆఫీసర్ శేఖర్ మృతి చర్యలకు అధికారులు సిద్ధం!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో వేటగాళ్ల కరెంట్ ఉచ్చుకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బలికావడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.
Kothagudem: బూర్గంపాడులో బీట్ ఆఫీసర్ శేఖర్ మృతి చర్యలకు అధికారులు సిద్ధం!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో వేటగాళ్లు ఏర్పాటు చేసిన కరెంట్ ఉచ్చుకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి చెందిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్గా స్పందించారు.
సింగారం వెస్ట్ బీట్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన డీఎఫ్ఓ, బాధ్యతలో నిర్లక్ష్యం వహించినట్లు భావిస్తున్న కిందిస్థాయి ఫారెస్ట్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
ఇదే ఘటనకు సంబంధించి విద్యుత్ సరఫరా, అక్రమ విద్యుత్ వినియోగం తదితర అంశాలపై విద్యుత్ శాఖ అధికారులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రాణాలను బలిగొన్న కరెంట్ ఉచ్చు వ్యవహారంలో అటవీ శాఖ పర్యవేక్షణ లోపం ఎక్కడ జరిగింది..? విద్యుత్ శాఖ పర్యవేక్షణలో వైఫల్యం ఏమైనా ఉందా..? వేటగాళ్లు కరెంట్ ఉచ్చులు ఏర్పాటు చేసేంత వరకు అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారు..? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.
షోకాజ్ నోటీసులకు అధికారులు ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.




