Palvancha: పాల్వంచలో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ఇల్లు

Palvancha: పాల్వంచ కరకవాగులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. విలువైన సామాగ్రి, సర్టిఫికెట్లు కాలిపోవడంతో బాధితులు రోడ్డున పడ్డారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 Sept 2026 4:39 PM IST
Palvancha
X

Palvancha: పాల్వంచలో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ఇల్లు

పాల్వంచ: పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని కరకవాగు గ్రామంలో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ కుటుంబం కట్టు బట్టలతో రోడ్డున పడింది.

మొహమ్మద్ ముబీన్ కు చెందిన ఇంట్లో సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి మంటలు చెలరేగాయి. పొరుగున ఉన్న మహిళ గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది కొత్తగూడెం నుండి ఫైరింజన్ తో వచ్చేలోపే ఇంట్లోని సామాగ్రి, నిత్యావసర వస్తువులు, పిల్లల ఒరిజినల్ సర్టిఫికెట్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో బాధిత కుటుంబం కట్టు బట్టలతో రోడ్డున పడింది.

అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని కరకవాగు గ్రామంలో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ కుటుంబం కట్టు బట్టలతో రోడ్డున పడింది.