Kothagudem: ఎవరికీ అదనపు రుసుములు, లంచాలు చెల్లించవద్దు ఆహార భద్రత శాఖ
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఐడీఓసీ లో ఈ నెల 24న ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో ఫుడ్ లైసెన్స్ మేళా నిర్వహించనున్నారు.
Kothagudem: ఎవరికీ అదనపు రుసుములు, లంచాలు చెల్లించవద్దు ఆహార భద్రత శాఖ
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో *తేదీ: 24-07-2026 (శుక్రవారం)* న *ఐడీఓసీ (IDOC), పాల్వంచలో **ఫుడ్ లైసెన్స్ మేళా* నిర్వహించబడుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ఆహార వ్యాపారులు, హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, బేకరీలు, కిరాణా దుకాణాలు, పాలు మరియు పాల ఉత్పత్తుల వ్యాపారులు, ఇతర ఆహార వ్యాపార సంస్థల యజమానులు ఈ మేళాకు హాజరై కొత్త ఫుడ్ లైసెన్స్/రిజిస్ట్రేషన్, లైసెన్స్ పునరుద్ధరణ (Renewal), సవరణలు (Modification) తదితర సేవలను పొందవచ్చు.
ఈ సందర్భంగా ఆహార వ్యాపారులకు ప్రత్యేకంగా తెలియజేయునది ఏమనగా, ఎట్టి పరిస్థితుల్లోనూ "తత్కాల్ ఫుడ్ లైసెన్స్" కోసం దరఖాస్తు చేయవద్దు మరియు "తత్కాల్ లైసెన్స్" పేరుతో ఎవరికి అదనపు రుసుములు చెల్లించవద్దు.* ఫుడ్ లైసెన్స్ పొందేందుకు సాధారణ విధానమే సరిపోతుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ఫుడ్ లైసెన్స్ మేళాను సద్వినియోగం చేసుకొని ఎలాంటి మధ్యవర్తులు లేకుండా అధికారిక విధానంలోనే సేవలు పొందవలసిందిగా కోరడమైనది.
అందువల్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ఆహార వ్యాపారులందరూ *24-07-2026 (శుక్రవారం)* నిర్వహించబడే *ఫుడ్ లైసెన్స్ మేళా*కు హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది.




