Kothagudem: కొత్తగూడెంలో ఆహార భద్రతపై ప్రత్యేక శిక్షణ.. అంగన్‌వాడీలకు దిశానిర్దేశం!

Kothagudem: ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంగన్‌వాడీ టీచర్లకు ఆహార భద్రతపై శిక్షణ.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 8 Jun 2026 7:55 AM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో ఆహార భద్రతపై ప్రత్యేక శిక్షణ.. అంగన్‌వాడీలకు దిశానిర్దేశం!

Bhadradri Kothagudem: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారంనాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆహార భద్రతా విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని అంగన్‌వాడీ టీచర్స్ కు ఆహార భద్రత శిక్షణ, ధృవీకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లా నుండి మొత్తం 300 మంది అంగన్‌వాడీ టీచర్లు రెండు బ్యాచ్‌లలో పాల్గొన్నారు. దీనితో పాటుగా అంగన్‌వాడీల కోసం రిజిస్ట్రేషన్ మేళా కూడా నిర్వహించబడింది.

ఈ సందర్భంగా DM&HO డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ సురక్షితమైన ఆహారం, ఆరోగ్యం ప్రధాన ఉద్దేశ్యంగా ఉండాలన్నారు. జిల్లాలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తామని, కల్తీపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆహార భద్రతా అధికారి శరత్ తెలిపారు. ఏవైనా ఫిర్యాదుల కోసం కొత్తగూడెం, ఐడిఓసి, 1వ అంతస్తు, రూమ్ నెం. ఎఫ్-3 లోని కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story