Bhadrachalam: 24 గంటల వ్యవధిలో భద్రాచలం ప్రాంతంలో రెండవ ప్రాణనష్టం!

Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో ఇసుక లారీ ఢీకొని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ మద్ది రాము దుర్మరణం చెందారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 15 Sept 2026 8:22 AM IST
Bhadrachalam
X

Bhadrachalam: 24 గంటల వ్యవధిలో భద్రాచలం ప్రాంతంలో రెండవ ప్రాణనష్టం!

Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీనర గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక లారీ ఢీకొని మద్ది రాము అనే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

ప్రతిరోజు చర్ల నుంచి వందల సంఖ్యలో ఇసుక లారీలు తిరుగుతున్నాయి. అధిక లోడుతో రావడంతో రోడ్లు మొత్తం గుంతల మయంగా మారాయి. చిన్నపాటి వర్షం పడితే చాలు గుంతలు ఎక్కడున్నాయో తెలియడం లేదు.

లారీలు తిరుగుతుంటే రహదారిపై ప్రయాణం చేసే వాహనదారులు ప్రాణాలను అరిచేతులో పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. వరుసగా 20 నుంచి 30 లారీల వరకు ఆగకుండా అతివేగంగా తిరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లారీ వెనక లారీ వెళ్తుంటే దుమ్ము ధూళితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో భద్రాచలంలో ఒక లారీ ఒక మహిళను ఢీకొట్టడంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

24 గంటలు గడవకముందే దుమ్ముగూడెం మండలం లక్ష్మీ నగరంలో మద్ది రాము అనే వ్యక్తి ని ఇసుక లారీ ఢీ కొట్టింది క్షణాల్లోనే ఆయన మృతి చెందినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ లారీల అతివేగానికి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

24 గంటలు పాటు లారీలు తిరుగుతూనే ఉన్నాయి. భద్రాచలం పట్టణంలో లారీలను ఆపి నిదానంగా వెళ్ళమని చెప్పే అధికారులే కరువయ్యారు. ఈ లారీలను అధికారులు ఎందుకు ఆపడం లేదు రాజకీయ నాయకులకు భయపడా..? ఈ అధికారులు ఇంకా ఎంతకాలం వారికి భయపడతారు ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతాయోనని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem