Palwancha: రేగళ్ల తండాలో ఉచిత కంటి వైద్య శిబిరం
Palwancha: లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల తండాలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి 170 మందిని పరీక్షించి, 15 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు.
Palwancha: రేగళ్ల తండాలో ఉచిత కంటి వైద్య శిబిరం
పాల్వంచ: లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్వంచ కిన్నెరసాని ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల తండా ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల ఆవరణలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు లయన్ చేపూరి బ్రహ్మచారి జన్మదినాన్ని పురస్కరించుకుని లయన్స్ ఐ హాస్పిటల్ వైరా వారి సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లయన్ డాక్టర్ బి. సుధాకర్ రావు (శ్రీ సాయి సుధా హాస్పిటల్, పాల్వంచ) శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లయన్స్ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, అందులో భాగంగానే గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
శిబిరానికి సహకరించిన లయన్స్ ఐ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కాపా మురళీకృష్ణ, లయన్ జీఎంటీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, సీనియర్ నేత్ర వైద్య నిపుణులు లయన్ ఉండ్రు శ్యాంబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రేగళ్ల తండా గ్రామపంచాయతీ సర్పంచ్ బి. పూర్ణచంద్ మాట్లాడుతూ.. తమ గ్రామపంచాయతీలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని, గ్రామ ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం పట్ల లయన్స్ క్లబ్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ శిబిరంలో ఆశ్రమ పాఠశాలకు చెందిన 90 మంది విద్యార్థులతో పాటు 80 మంది గ్రామస్తులు కలిపి మొత్తం 170 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 15 మందికి లయన్స్ ఐ హాస్పిటల్‌లో ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు కంటి వైద్యుడు డాక్టర్ రవిచంద్ర తెలిపారు. అవసరమైన ఇతరులకు కళ్లద్దాలు, కంటి చుక్కల మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జోన్-3 చైర్‌పర్సన్ లయన్ కేదారేశ్వరరావు, లయన్స్ క్లబ్ పాల్వంచ కిన్నెరసాని ట్రెజరర్ లయన్ మాడిశెట్టి రాజమనోహర్, క్లబ్ జీఎస్టీ ఎండీ రంజాన్, లయన్స్ క్లబ్ పాల్వంచ పవర్ అధ్యక్షుడు చావా రమణ, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం గుగులోత్ హరి, ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్ గుగులోత్ రవి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




