Bhadrachalam: వినాయక చవితి వేళ భద్రాద్రిలో కనువిందు చేసిన నదీహారతి!

Bhadrachalam: భద్రాచలంలో గోదావరి మాతకు వైభవంగా నది హారతి నిర్వహించారు. వినాయక చవితి ముందు రోజు జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పులకించారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 13 Sept 2026 11:47 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: వినాయక చవితి వేళ భద్రాద్రిలో కనువిందు చేసిన నదీహారతి!

భద్రాచలం సెప్టెంబర్ 13: శ్రీ సీతారామ చంద్ర స్వామికి ఆదివారం నాడు నిర్వహి ంచే గోదావరి నదిహారతి అత్యంత పుణ్యప్రదమైనదని, వినాయక చవితి ముందు రోజు జరిగే నదిహారతి చాలా ప్రీతికరమైనదని వరసిద్ధి వినాయకుని శుభాశీస్సులతో ఈరోజు లోక కళ్యాణార్ధం గోదావరి మాతకు సమర్పించే హారతులు సమస్త ప్రజలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేస్తాయని భద్రాద్రి పురోహితుల సంఘం అధ్యక్షులు రామవజ్జల రవికుమార్ భక్తులకు తెలిపారు. ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి దివ్య క్షేత్రం భద్రాచలంలో గోదావరి కరకట్ట ప్రదేశాలలో జరిగిన నదీహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జిల్లా కలెక్టర్ సంకల్పంతో ప్రతి ఆదివారం భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోదావరి హారతి కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు పాల్గొని శ్రీరామా అనుగ్రహంతో గోదావరి మాత శుభాశీస్సులు పొందుతున్నారని అన్నారు.స్థానిక స్వచ్ఛంద సంస్థలు అధికారులు, గ్రామపంచాయతీ వారి సహకారంతో ప్రతి ఆదివారం గోదావరి హారతి నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు.

ముందుగా గణపతి పూజ చేసి శ్రీ సీతరామచంద్రస్వామి వారికి, గోదావరి మాతకు అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించి, అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి, గోదావరి మాతకు హారతులు సమర్పించిన అనంతరం జి.వెంకటరమణ, పూర్ణిమ, యశోద రాణి మరియు రామ్ నాయక్, లక్ష్మీ కనకదుర్గ, పిఎస్ ఎన్ వి సత్యనారాయణ రెడ్డి దంపతులు గోదావరి మాతకు ప్రసాదం పంపిణీ చేయగా భద్రాచలం రెడీమేడ్ బట్టల దుకాణం సంఘం ఆధ్వర్యంలో పూజా సామాగ్రి సమర్పించారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో చంద్రశేఖర శర్మ, రామాచార్యులు, తేజాశర్మ, తిరుపతిరావు, రిషి, సత్యనారాయణ రెడ్డి, నరసింహ శర్మ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem