Mahabubabad: గుండెపోటుతో దూదిమెట్ల లింగన్న మృతి, కాంగ్రెస్ సంతాపం!

Mahabubabad: మహబూబాబాద్ కురవి మండలం అయ్యగారిపల్లికి చెందిన దూదిమెట్ల లింగన్న గుండెపోటుతో మృతి. ఆయన పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్.

P PRABHAKAR, DORNAKAL
Published on: 27 Sept 2026 12:00 PM IST
Mahabubabad
X

Mahabubabad: గుండెపోటుతో దూదిమెట్ల లింగన్న మృతి, కాంగ్రెస్ సంతాపం!

Mahabubabad: మండలంలోని అయ్యగారిపెల్లి గ్రామానికి చెందిన దూదిమెట్ల లింగన్న గారు గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ అయ్యగారిపెల్లి గ్రామానికి చేరుకుని లింగన్న పార్థివదేహానికి నివాళులర్పించారు.

అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లింగన్న మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.

ఈ కార్యక్రమంలో కురవి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలగాని శ్రీనివాస్ గౌడ్, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL