Annapureddypally: పేద కుటుంబాలకు పెన్షన్లతో ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే జారె!
Annapureddypally: అన్నపురెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అర్హులైన లబ్ధిదారులకు నూతన చేయూత పెన్షన్లు అందజేశారు.
Annapureddypally: పేద కుటుంబాలకు పెన్షన్లతో ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే జారె!
అన్నపురెడ్డిపల్లి: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు నూతన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు నూతన పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు నూతన చేయూత పెన్షన్లు ఎంతో ఆర్థిక భరోసాగా నిలువనున్నాయని తెలిపారు. వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు ప్రతి నెలా అందే పెన్షన్ వారి రోజువారీ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించే దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు.
రాష్ట్రంలోని పేద,మధ్యతరగతి కుటుంబాల తోపాటు రైతుల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రజలు అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు. అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో గెలుపొంది, ముఖ్యమంత్రి మరియు జిల్లా మంత్రుల సహాయ సహకారాలతో నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు.
అనంతరం పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులతో నేరుగా మాట్లాడించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల వారి కుటుంబాలకు కలుగుతున్న ప్రయోజనాలను తెలుసుకున్నారు. పెన్షన్లు అందడంతో తమకు ఎంతో ఊరట కలుగుతోందని ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం తమ జీవనానికి ఎంతో తోడ్పడుతోందని సంతోషంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పొదిలి జ్యోతి మండల అధ్యక్షులు పర్సా వెంకట్ , వనమా గాంధీ, భానోత్ భీముడు , వేముల రమణారావు గారు, MPDO రాజేశ్వరి, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పెన్షన్ లబ్ధిదారులు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




