Kothagudem: రామవరంలో ఉచిత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు షురూ!
Kothagudem: కొత్తగూడెం రామవరంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి ప్రారంభించారు.
Kothagudem: రామవరంలో ఉచిత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు షురూ!
Kothagudem: రామవరం ప్రాంతంలోని అర్హులైన పట్టభద్రులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి పిలుపునిచ్చారు.
బుధవారం కొత్తగూడెం టౌన్ పరిధిలోని రామవరంలో తన నివాస ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. నవంబర్ 1, 2023 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగిన పట్టభద్రులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అర్హులైన పట్టభద్రులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమానికి పట్టభద్రుల నుంచి విశేష స్పందన లభించిందని నిర్వాహకులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తొగరు రాజశేఖర్, ఖాజా భక్ష్, షరీఫ్, వీర్రాజు, నాగరాజు, అక్బర్, అర్మాన్తో పాటు రామవరం ప్రాంతానికి చెందిన పలువురు పట్టభద్రులు పాల్గొన్నారు.




