Aswaraopeta: అశ్వారావుపేటలో వైభవంగా 5వ రోజు అట్ల బతుకమ్మ వేడుకలు!
Aswaraopeta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 5వ రోజు 'అట్ల బతుకమ్మ' వేడుకలు ఘనంగా జరిగాయి.
Aswaraopeta: అశ్వారావుపేటలో వైభవంగా 5వ రోజు అట్ల బతుకమ్మ వేడుకలు!
Aswaraopeta: అశ్వారావుపేట భద్రాచలం రోడ్ హీరో షోరూం ముందు పెట్టిన దుర్గా మాత దగ్గర ఐదో రోజు అట్ల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
గుర్రాలచెరువు వినాయకుని గుడి, రామాలయం, మారుతీ నగర్ కాలనీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఏర్పాటు చేసిన అమ్మవారి ముందు మహిళాలు , యువతులు వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.




