Manuguru: నవంబర్ 29న మణుగూరులో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమం!
Manuguru: నవంబర్ 29న మణుగూరులో నిర్వహించే దీక్షా దివస్ ఏర్పాట్లపై పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం స్థల పరిశీలన చేశారు.
Manuguru: నవంబర్ 29న మణుగూరులో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమం!
Manuguru: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు చేపట్టిన చారిత్రాత్మక ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా నవంబర్ 29న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని పినపాక నియోజకవర్గ కేంద్రం మణుగూరులో ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు బీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు గారు మణుగూరులో స్థల పరిశీలన చేపట్టారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు హాజరయ్యేలా అవసరమైన ఏర్పాట్లు, సభా ప్రాంగణం, ఇతర సౌకర్యాలపై పార్టీ నాయకులతో చర్చించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో ఒక మహత్తర ఘట్టమని, ఆ దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం కీలక మలుపు తిరిగిందని రేగా కాంతారావు గారు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాన్ని, అమరుల త్యాగాలను, కేసీఆర్ గారి నాయకత్వంలో సాగిన ఉద్యమ ప్రస్థానాన్ని స్మరించుకుంటూ నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.




