Palwancha: పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లిలో సామూహిక సత్యనారాయణ వ్రతం!
Palwancha: పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా 30 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం ఘనంగా జరిగింది.
Palwancha: పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లిలో సామూహిక సత్యనారాయణ వ్రతం!
పాల్వంచ: పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి పంచాయతీలో గల శ్రీ శ్రీ శ్రీ గోవిందాంబ సమేత శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం రంగా రంగా వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది.
ఆలయ అర్చకులు నాగాచారి మరియు శశాంక్ అయ్య గార్ల సమక్షంలో సుమారు 30 జంటలు కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. వారికి ఆలయ కమిటీ ద్వారా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా సోదరీమణులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పీటల మీద కూర్చున్న వారిలో ఆలయ కోశాధికారి ప్రభాకరాచార్య దంపతులు, పులిమడుగు మధు దంపతులు, చింతోజు బ్రహ్మారావు దంపతులు, తులసి మేడం తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన ధర్మకర్త కాపర్తి వెంకటాచారి, దిగుట్ల వెంకటాచారి, సుంకర తిరుమల చారి, బస పోతుని తిరుపతి సత్యనారాయణ, తాడి సత్తిరెడ్డి, రత్నాచారి రావు, లోజు వెంకటాచారి, దిగుట్ల సత్యనారాయణ, బిక్షమాచారి, పాయం పాపయ్య తదితరులు పాల్గొని సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు.




