Kothagudem: భగత్‌సింగ్‌కు గ్రీన్ నివాళి: 1579వ మొక్క నాటిన విశ్వామిత్ర!

Kothagudem: భగత్‌సింగ్ జయంతి సందర్భంగా గ్రీన్ నివాళి కొత్తగూడెం ఐడీఓసీలో డీపీవో అనూషతో కలిసి 1579వ పనస మొక్కను నాటిన పర్యావరణ ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 28 Sept 2026 11:12 PM IST
Kothagudem
X

Kothagudem: భగత్‌సింగ్‌కు గ్రీన్ నివాళి: 1579వ మొక్క నాటిన విశ్వామిత్ర!

భద్రాద్రి కొత్తగూడెం.. సెప్టెంబర్ 28: అమరవీరుడు భగత్‌సింగ్ జయంతిని పురస్కరించుకుని విశ్వామిత్ర చౌహాన్ వినూత్నంగా నివాళులర్పించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ‘వాక్ ఫర్ ట్రీస్’ కాన్సెప్ట్‌తో ప్రతిరోజూ మొక్కలు నాటుతున్న ఆయన.. తన 1579వ మొక్కగా పనస మొక్కను నాటారు. కొత్తగూడెంలోని ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో జిల్లా పంచాయతీ అధికారి అనూషతో కలిసి మొక్క నాటారు.

ఈ సందర్భంగా డీపీఓ అనూష మాట్లాడుతూ.. కేవలం 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్‌సింగ్ త్యాగం వెలకట్టలేనిదన్నారు. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదంతో యువతలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన గొప్ప సమరయోధుడని కొనియాడారు. నేటి యువత భగత్‌సింగ్‌ను ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. చిన్న వయసులోనే పర్యావరణంపై అవగాహనతో వేలాది మొక్కలు నాటుతున్న విశ్వామిత్ర చౌహాన్ కృషిని ఆమె అభినందించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM