Vemsur: ఏపీ నుంచి తరలిస్తున్న 34 టన్నుల ఇసుక స్వాధీనం!

Vemsur: వేంసూరులో అక్రమ ఇసుక లారీ పట్టివేత ఏపీలోని కొవ్వూరు నుంచి 34 టన్నుల ఇసుక తరలింపు డ్రైవర్ చందు రిమాండ్, మధ్యవర్తి చెన్నారావుపై కేసు నమోదు చేసిన ఎస్ఐ ప్రదీప్.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 1 Oct 2026 10:28 PM IST
Vemsur
X

Vemsur: ఏపీ నుంచి తరలిస్తున్న 34 టన్నుల ఇసుక స్వాధీనం!

వేంసూరు: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం లో పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ ప్రదీప్ తెలిపారు. ఈ నెల 29న పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఎర్రగుంటపాడు, లంకపల్లి మార్గంలో లారీ (TS 04 UE 6819) ని తనిఖీ చేసి, అనుమతులు లేకుండా ఏపీలోని కొవ్వూరు నుండి తరలిస్తున్న 34 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.

రేజర్లకు చెందిన లారీ యజమాని-కమ్-డ్రైవర్ కోనకళ్ల చందు, విఎమ్ బంజారాకు చెందిన మధ్యవర్తి బండారి చెన్నారావుతో కలిసి టన్ను రూ.1,200 చొప్పున అక్రమంగా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.

పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి లారీని సీజ్ చేయడమే కాకుండా నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టి లారీ యజమాని-కమ్-డ్రైవర్ కోనకళ్ల చందు ని రిమాండ్ కు తరలించారు. ఈ క్రమంలో మండలంలో ఎక్కడైనా అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీకుంటామని తెలియచేస్తున్నాం.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI