Kukunoor: కుక్కునూరు పిఎస్ పరిధిలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!

Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో 80వ స్వాతంత్య్ర దినోత్సవం. జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించిన సిఐ సురేష్ బాబు, ఎస్ఐ రాజారెడ్డి.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 15 Aug 2026 5:43 PM IST
Kukunoor
X

Kukunoor: కుక్కునూరు పిఎస్ పరిధిలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!

Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుక్కునూరు సిఐ పి. సురేష్ బాబు, ఎస్ఐ కె. రాజారెడ్డి, పోలీసు సిబ్బందితో కలసి జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి, జెండా వందనం నిర్వహించారు.

అనంతరం దేశ స్వాతంత్య్ర కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ దేశభక్తి, జాతీయ సమైక్యత, ప్రజాసేవ పట్ల పోలీసు సిబ్బంది తమ నిబద్ధతను చాటుకున్నారు.ఈ వేడుకల్లో స్థానిక పాఠశాల విద్యార్థులు పాల్గొని క్రమశిక్షణతో కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు పోలీసు సిబ్బంది స్వీట్లు అందించి అభినందించారు.

ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సమాజంలో దేశభక్తి, క్రమశిక్షణ, బాధ్యతాయుత పౌరసత్వం పెంపొందించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కుక్కునూరు సిఐ పి. సురేష్ బాబు, ఎస్ఐ కె. రాజారెడ్డి, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story