Bhadrachalam: ఇందిరా గాంధీ వర్ధంతి.. నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు
Bhadrachalam: భద్రాచలంలో ఇందిరా గాంధీ వర్ధంతి. బ్రిడ్జి సెంటర్‌లోని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్ పూనెం కృష్ణ.
Bhadrachalam: ఇందిరా గాంధీ వర్ధంతి.. నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు
భద్రాచలం: భద్రాచలం బ్రిడ్జి సెంటర్‌లో భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి 42వ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీ పూనెం కృష్ణ గారు మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి స్వర్గీయ ఇందిరా గాంధీ గారు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశ సమగ్రత, సమైక్యత కోసం ఆమె చేసిన కృషి భారత చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు.
ఇందిరా గాంధీ గారు అనుసరించిన ప్రజా సంక్షేమ విధానాలు, ఆమె ఆశయాలు నేటికీ ప్రజలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమె ఆశయాలను, ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రత్నం రమాకాంత్, నర్రా రాము, భీమవరపు వెంకటరెడ్డి, అరికెల్ల తిరుపతిరావు, తాళ్ళపల్లి రమేష్ గౌడ్, నక్క వెంకన్న, బండారు సుధాకర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు పడిసిరి శ్రీనివాసరావు, 10వ వార్డు మెంబర్ నిట్టా రాజు, చాట్ల రవి కుమార్, చింతాడి రామకృష్ణ, ఒగ్గె రమణ, గుండెపల్లి హనుమంతురావు, రాంబాబు, నరసింహరావు యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ గాడి విజయ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆకుల వెంకట్, యూత్ కాంగ్రెస్ మండల కార్యదర్శి మాచినేని భాను, యూత్ జమిర్, రవి, మహిళ నాయకురాలు వసంతాల కళ్యాణి, రాజేశ్వరి, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొని స్వర్గీయ ఇందిరా గాంధీ గారికి ఘనంగా నివాళులర్పించారు.




