Chandrugonda: బెండాలపాడులో ఘనంగా ఇందిరమ్మ ఇంటి నూతన ద్వార ప్రతిష్ఠాపన!
Chandrugonda: బెండాలపాడులో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ మహోత్సవం. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చొరవతో గ్రామంలో కొత్త విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు.
Chandrugonda: బెండాలపాడులో ఘనంగా ఇందిరమ్మ ఇంటి నూతన ద్వార ప్రతిష్ఠాపన!
Chandrugonda: చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో, సర్పంచ్ బొర్రా లలిత , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ కమిటీ సభ్యుడు బొర్రా సురేష్ ఆదేశానుసారం ఈరోజు ఆంగోత్ ప్రసాద్, సంధ్య దంపతుల ఆహ్వానం మేరకు వారి ఇందిరమ్మ ఇల్లు నూతన గృహ ద్వార ప్రతిష్ఠాపన మహోత్సవం వేడుకలో పాల్గొన్ని, ఇందిరమ్మ ఇంటి లబ్ధిరాలు మరియు కుటుంబ సభ్యులతో కలిసి గుమ్మంలో కొబ్బరి కాయలు కొట్టి దర్వాజా శంకుస్థాపన చేసి, వారి కుటుంబ సభ్యులకు నూతన గృహ ద్వార ప్రతిష్టాపన శుభాకాంక్షలు తెలియజేసిన గ్రామ శాఖ కాంగ్రెస్ నాయకులు.
అనంతరం విద్యుత్ వినియోగం పెరగడం వల్ల అదనపు విద్యుత్ సరఫరా కొరకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారితో, కొత్త విద్యుత్ ట్రాన్స్ఫర్, స్తంభాలు మంజూరు చేయించి, సర్పంచ్ బొర్రా లలిత ఆదేశానుసారం త్వరితగతిన సంబంధిత విద్యుత్ శాఖ వారితో బెండాలపాడు గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల, శ్రీ భక్తంజనేయ గుడి వద్ద ఈ రెండింటి మధ్య విద్యుత్ స్తంభాలు వేసి కొత్త ట్రాన్స్ఫర్ ను వేయించటం జరిగింది.
ఈ శుభ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిరాలు మాట్లాడుతూ, మాకు ఆర్ధిక పరమైన ఇబ్బందుల దృష్ట్యా పక్కా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, ఇకనైనా భవిష్యత్తులో కూడా కట్టుకోలేము అనుకున్న సమయంలో కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇంటికి అర్హులైన మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, ఇల్లు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు అర్హులుగా గుర్తించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారికి , సర్పంచ్ బొర్రా లలిత గారికి , ఇందిరమ్మ కమిటీ సభ్యులకు, గ్రామ శాఖ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఈరోజు ఈ శుభ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ బొర్రా లలిత, సురేష్ అనారోగ్య కారణంగా హాజరు కాలేకపోయారు, సర్పంచ్ బొర్రా లలితకు ఇటీవల ఇంటి వద్ద ప్రమాదవశాత్తు కింద పడి కాలుకు గాయమైన సంగతి తెలిసిందే , కొత్తగూడెం ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో , ఇంతకుముందు తీసుకున్న చికిత్స విఫలమవడంతో మరల గాయమైన చోట నొప్పి తీవ్రమవ్వటంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అందుకని వారు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు ఈ సందర్భంగా తెలియజేసిన కాంగ్రెస్ నాయకులు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షుడు ఓర్సు రామకృష్ణ , సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ వీసం రాములు , మాజీ ఎంపీటీసీ కారం వెంకటేశ్వర్లు , సీనియర్ నాయకుడు మల్లం కృష్ణయ్య , మరియు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు చల్లా నర్సింహారావు, ఎస్.కె. ఆసీఫ్, గ్రామ శాఖ బిఎల్ఎ పొట్ట రాము, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి కాక సురేష్, కార్యవర్గ సభ్యుడు రాయల నరేష్, గ్రామ శాఖ సేవాదళ్ అధ్యక్షుడు ఆంగోత్ రమేష్, గ్రామ నాయకులు అజ్మీరా రమేష్, ఆంగోత్ బలరాం, తేజావత్ రాంబాబు, ఆంగోత్ హల్య ,సిపిఎం గ్రామ శాఖ నాయకుడు గోగుల తిరుమలరావు, మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.




