Aswapuram: దేవాలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: సీఐ ఎల్లయ్య!

Aswapuram: మండలంలోని దేవాలయాల వద్ద భద్రతా చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అశ్వాపురం సీఐ సీహెచ్. ఎల్లయ్య ఆదివారం ఆలయ కమిటీకి సూచించారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 29 Nov 2026 8:03 PM IST
Aswapuram
X

Aswapuram: దేవాలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: సీఐ ఎల్లయ్య!

అశ్వాపురం: మండలంలోని దేవాలయాల వద్ద భద్రతా చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అశ్వాపురం సీఐ సీహెచ్. ఎల్లయ్య సూచించారు. ఆదివారం ఓం ఆదిపరాశక్తి దేవాలయం వద్ద భక్తులతో, ఆలయ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవాలయాల వద్ద జరిగే కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉండేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఎంతో అవసరమని తెలిపారు.

ఆలయాల భద్రతతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేవాలయాల రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని సీఐ ఎల్లయ్య కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA