Aswapuram: అంతర్జాతీయ పురస్కార గ్రహీత షహనాజ్ బేగంకు ఘన సన్మానం
Aswapuram: భద్రాద్రి జిల్లా అశ్వాపురంలో అంతర్జాతీయ పురస్కార గ్రహీత షహనాజ్ బేగంను నేషనల్ సేవా ఫౌండేషన్ సన్మానించి, వృద్ధాశ్రమంలో భోజనం, దుప్పట్లు పంపిణీ చేసింది.
Aswapuram: అంతర్జాతీయ పురస్కార గ్రహీత షహనాజ్ బేగంకు ఘన సన్మానం
అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండల కేంద్రంలోని మంచికంటినగర్ నందు నడుపుతున్న... ఆరిఫా రోషిని అండ్ రీమా వృద్ధాశ్రమ నిర్వాహకురాలు, షహనాజ్ బేగం కు అంతర్జాతీయ ప్రతిభ - పురస్కారం వరించిన సందర్భంగా, నేషనల్ సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు.
సామాజిక సేవ, మానవీయ విలువలకు ప్రాధాన్యతనిస్తూ, నేషనల్ సేవా ఫౌండేషన్ అశ్వాపురం మండలంలోని ఓ వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు భోజనం,పండ్లు, తిను బండారాలు దుస్తులు, దుప్పట్లు సమకూర్చింది. వృద్ధుల పట్ల ఆప్యాయత, గౌరవం, బాధ్యతను చాటుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ వృద్ధాశ్రమాన్ని షహనాజ్ తన సొంత ఆర్థిక వనరులతో నిర్వహిస్తున్నారు. తన వ్యక్తిగత వనరులను వెచ్చిస్తూ వృద్ధులకు ఆశ్రయం కల్పించడంతో పాటు, వారి ఆలనాపాలనా చూసుకుంటున్నారు.
ఈ సందర్భంగా షానాజ్ మాట్లాడుతూ, వృద్ధులకు భోజనం అందించేందుకు ముందుకు వచ్చిన నేషనల్ సేవా ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధుల సంక్షేమం కోసం వ్యక్తులు, సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించడం సంతోషంగా ఉందన్నారు. నేటి సమాజంలో వృద్ధులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నేషనల్ సేవా ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ చిన్ని బాబు అరిగెల మాట్లాడుతూ, వృద్ధుల కోసం షానాజ్ చేస్తున్న సేవలను అభినందించారు. తాము అందిస్తున్న సహాయం సముద్రంలో నీటిబొట్టుతో సమానమని, అయితే ఈ వృద్ధాశ్రమం చేస్తున్న సేవ సముద్రం అంత గొప్పదని కొనియాడారు. వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ, వారి గౌరవప్రదమైన జీవితానికి అండగా నిలుస్తున్న వారి నిస్వార్థ సేవను ప్రశంసించారు.
నేషనల్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ శ్రీ డాక్టర్ పి. శ్రీనివాసులు భారత అవినీతి నిరోధక మరియు విజిలెన్స్ మండలి శాఖ (భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన )లో (తెలంగాణ చీప్ గా ) వ్యవహరిస్తున్నారు కాగా,కనూరు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో... ఫౌండేషన్ స్థానిక బృందం, కొత్తగూడెం ప్రాంతానికి చెందిన ట్రస్టీలు, న్యాయవాదులు ఈ. చంద్రకాంత్, జె. మదన్ మోహన్ రావు పాల్గొన్నారు. న్యాయవాది సింగం శ్రీధర్,పి. గణేష్, దుర్గ, సంపత్ పాల్గొన్నారు.
విద్య, వైద్యం, మహిళా సాధికారత, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, యువత అభివృద్ధి, సామాజిక సంక్షేమం వంటి పలు రంగాల్లో నేషనల్ సేవా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
భోజన వితరణ, నిత్యావసర వస్తువుల పంపిణీ, మారుమూల ప్రాంతాల్లో విద్యా సహాయం వంటి కార్యక్రమాల ద్వారా క్షేత్రస్థాయిలో సమాజానికి అండగా నిలవాలని ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకుంది.
వృద్ధులను ఆదుకోవడం కేవలం దాతృత్వం కాదు, అది సమాజం పట్ల మనకున్న బాధ్యత. వారి పట్ల గౌరవం, ఆప్యాయత చూపడం మనందరి సామాజిక బాధ్యత అని నేషనల్ సేవా ఫౌండేషన్ విశ్వసిస్తోంది.




