Khammam: ఖమ్మంలో ఘనంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు!

Khammam: ఖమ్మం జిల్లా బాలల సదనంలో బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 14 Oct 2026 4:07 PM IST
Khammam
X

Khammam: ఖమ్మంలో ఘనంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు!

Khammam: జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి పాలేటి ప్రమీలా గారి ఆధ్వర్యంలో, బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలోని బాలల సదనంలో బాలికలతో కలిసి అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డాక్టర్ శ్రీజా గారు, ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) కార్యదర్శి శ్రీమతి పి. దేవి మానస గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలికలతో కేక్ కట్ చేయించి, స్వీట్లు పంపిణీ చేసి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.

ఈ కార్యక్రమం ద్వారా బాలికల హక్కులు, విద్య, ఆరోగ్యం, భద్రత, సమాన అవకాశాలు మరియు సాధికారతపై అవగాహన కల్పించారు. బాలికలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా ప్రోత్సహించాలని, బాలికల పట్ల వివక్షను తొలగించి, వారికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలని అధికారులు సూచించారు.

బాలికల సంరక్షణ, విద్య, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, బాల్యవివాహాలను అరికట్టి ప్రతి బాలికకు ఉజ్వల భవిష్యత్తును అందించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ కమిటీ (CWC) చైర్‌పర్సన్ శ్రీమతి భారతి గారు, CWC సభ్యులు, బాలల సంరక్షణ అధికారి శ్రీమతి విష్ణు వందన గారు, ఈఓ కల్యాణి గారు, బాలల సదనం సూపరింటెండెంట్ నవ్య గారు, జిల్లా మహిళా సాధికారత కేంద్రం (DHEW) కోఆర్డినేటర్ ఎస్.డి. సమ్రీన్, జెండర్ స్పెషలిస్టులు పి. ప్రమీలా, ఆర్. వాసంతి, కె. సతీష్, జిల్లా పోషణ అభియాన్ కోఆర్డినేటర్ కొమినేని బాబు గారు, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ సూపరింటెండెంట్ ఎన్. ముత్తయ్య గారు తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.