Kothagudem: కొత్తగూడెం జీఎం ఆఫీస్‌లో హల్‌చల్.. కొత్త ఎస్ఓకు ఘన స్వాగతం

Kothagudem: కొత్తగూడెం సింగరేణి ఏరియా జీఎం ఆఫీస్‌కు బదిలీపై వచ్చిన ఎస్.ఓ.టూ.జి.ఎం (SO to GM) ఏం.గోవిందరావును ఐఎన్‌టీయూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 7 Jun 2026 9:37 AM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెం జీఎం ఆఫీస్‌లో హల్‌చల్.. కొత్త ఎస్ఓకు ఘన స్వాగతం

కొత్తగూడెం: సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియాలోని జీ.యం ఆఫీస్ కు బదిలీపై వచ్చిన ఎస్.ఓ.టూ.జి.ఎం, ఏం.గోవిందరావును మర్యాద పూర్వకంగా కలిసిన ఐఎన్టీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, నాయకులు.

యం.గోవిందరావు, ఎస్.ఓ.టూ.జి.ఎం,గా కొత్తగూడెం ఏరియా జి.ఎం ఆఫీస్ కు బదిలీపై వచ్చిన సందర్భంగా ఐఎన్టియుసి కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, ఆధ్వర్యంలో ఐఎన్టియుసి నాయకులతో కలిసి జి.ఎం ఆఫీస్ లో ఆయనకు పూల బొకే ఇచ్చి, శాలువా కప్పి స్వాగతం పలికారు.

ఈసందర్బంగా రజాక్ మాట్లాడుతూ కొత్తగూడెం ఏరియాలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని, సింగరేణి సంస్థలో జరిగే పలు కార్యక్రమాలను విజయవంతం అయ్యేలా ,ఉత్పత్తి ఉత్పాదకతల్లో కొత్తగూడం ఏరియాను ముందుండేలా చూడాలని, ఉద్యోగుల సమస్యలను త్వరగా పరిష్కారం అయ్యే విధంగా సహకరించాలని ఎస్ ఓ టు జి ఎం గోవిందరావును కోరారు.

IR రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉద్యోగులకు సహాయ సహకారాలు అందించాలని, ఐఎన్టియుసి ట్రేడ్ యూనియన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ బుటిక రాజేశ్వరావు, సీనియర్ నాయకులు జీదుల రాజేశ్వరరావు, ఫిట్ కార్యదర్శులు చిలుక రాజయ్య,గోపు కుమార స్వామి,ఎం.డి సత్తార్ పాషా,ఈ మోహన్ రెడ్డి,కే.నటరాజ్, సిహెచ్.సాగర్, మల్లికార్జున్, సెంట్రల్ మరియు బ్రాంచ్ కార్యదర్శిలు, సకినాల సమ్మయ్య, భీముడు, అసిస్టెంట్ సెక్రటరీలు వసంత్ కుమార్, భాను కమల్, బొద్దుల రవీందర్, నాయకులు బొజ్జ.వెంకట స్వామి, కలవల శ్రీనివాస్, డి శ్రీనివాస్, దుర్గా సింగ్, స్వామి, శ్రీకాంత్ శర్మ,బి.శ్రీనివాస్, చిప్ప నరేష్, ఖాజా పాషా,రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్,రమేష్ బాబు,కిషోర్, అరవింద్, అశోక్, లగ్గాల అజయ్, నరసింహారావు, రవికాంత్, వెంకటేశ్వరరావు, వాల్సన్, శ్రీనివాస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story