Uppusaka: ఉప్పుసాక ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ డిడీ తనిఖీ
Uppusaka: బూర్గంపాడు మండలం ఉప్పుసాక గిరిజన ఆశ్రమ పాఠశాల, హాస్టల్‌ను ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ చందన, ఏటీడీవో రాధ ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు.
Uppusaka: ఉప్పుసాక ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ డిడీ తనిఖీ
బూర్గంపాడు మండలం, ఉప్పుసాక: బూర్గంపాడు మండలంలోని ఉప్పుసాక గిరిజన ఆశ్రమ పాఠశాలను ఈరోజు ITDA డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి చందన గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా ముందుగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించి, విద్యార్థులను ప్రశ్నలు అడగగా వారు సరైన సమాధానాలు చెప్పడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల టైమ్‌టేబుల్, ఉపాధ్యాయుల డైరీలు మరియు కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారికి నిరంతరం సరైన శిక్షణ అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీ పిచ్చయ్య గారిని పాఠశాలకు సంబంధించిన పలు అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తదుపరి హాస్టల్‌ను సందర్శించి, స్టోర్ రూమ్ శుభ్రంగా, క్రమబద్ధంగా ఉండటాన్ని గమనించి వార్డెన్‌ను అభినందించారు.
విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించడం, పాఠశాల మరియు వసతి గృహాల్లో పరిశుభ్రతను పాటించడం పట్ల డిప్యూటీ డైరెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. పిచ్చయ్య, సీనియర్ ఉపాధ్యాయలు బి.భీమా, బి.ప్రసాదరావు, బీవీ, రాజేష్, జి.భద్రు జి.రాములు, టీ.విజయ, బి. విజయ, వార్డెన్ బి.రాములు, రవి,వెంకట్, ధర్మరాజు, నరసింహ రావు, కిషన్, రమేష్, గోవింద్ పాల్గొనడం జరిగింది.




