Kothagudem: సింగరేణి ఇతర రాష్ట్రాల ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం శేషగిరి భవన్‌లో ఎఐటియుసి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.
Kothagudem: సింగరేణి ఇతర రాష్ట్రాల ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
కొత్తగూడెం: కొత్తగూడెం లోని శేషగిరి భవన్ లో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి ముఖ్య నాయకుల సమావేశం. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మిరియాల రంగయ్య సింగరేణి కంపెనీ, ప్రభుత్వం, ఐఎన్టియుసి కార్మిక సంఘం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సింగరేణి కంపెనీ డెవలప్మెంట్ చేస్తున్నామని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నదని, అనేకమైన కార్మిక సంక్షేమ కార్యక్రమాలను విస్మరించారని, సమస్యలను పెండింగ్ పెట్టారని విమర్శించారు.
రికగ్నైజ్డ్
యూనియన్ ని పిలిచి చాలా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించినట్లు డైరెక్టర్ పా ప్రకటించారని, తక్షణమే వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మల్టీ డిసిప్లనరీ కమిటీలు పెట్టి అన్ని ఏరియాల్లో కార్మికుల పనిగంటలు పెంచుతామని,సింగరేణి గనుల్లో ఉత్పత్తి టార్గెట్ కోసం కార్మికుల పై ఒత్తిడికి జీవో లను జారీ చేస్తున్నారని విమర్శించారు. కనీస సౌకర్యాలు , కొత్త యంత్రాలు లేకుండా ఉత్పత్తి పై ఒత్తిడి కి మల్టీ డిసిప్లినరీ కమిటీలు ఏర్పాటు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు.
మిషనరీ బాగున్నదా, కొత్త మిషన్లు తెస్తున్నారా, పాత మిషనరీ కి వెల్డింగ్ టాకాలు వేసి నడిపితే ఉత్పత్తి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గనుల్లో మిషనరీ అవైలబిలిటీ లేకుండా ,సౌకర్యాలు కల్పించకుండా ఉత్పత్తి లక్ష్యాల పేరుతో "కార్మికులను దొంగలుగా చేయొద్దని హెచ్చరించారు". మిషనరీ అవైలబులిటి పెంచాలని సూచించారు. మ్యాన్ ఈజ్ నాట్ మిషనరీ మనిషి యంత్రం కాదన్నారు.
65 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం రావాలంటూ మల్టీసిప్లినరీ కమిటీ సమావేశాలు పెట్టి కార్మికులపై ఒత్తిడి తెస్తున్నారు తప్ప వారి రక్షణ,సంక్షేమం కోసం ఆలోచన చేయడం లేదన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయని 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ఓసి లో ఉన్న కార్మికులకు టైం చేంజ్ చేయాలని, ఏసీలు ఉన్నప్పటికీ కార్మికులు ఎండల్లో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికులకు ఇన్సెంటివ్ లేదని వారి సంక్షేమ కార్యక్రమాలు విస్మరించారని విమర్శించారు . మేనేజ్మెంట్ తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. జూన్ నెల వస్తున్నా లాభాల వాటా ప్రకటించకుండా కార్మికులను యాజమాన్యం మభ్య పెడుతున్నదని విమర్శించారు. చాలా నెలలు అవుతున్నా సీఎండీ లెవెల్లో స్ట్రక్చర్ మీటింగ్ లు పెట్టడం లేదని తక్షణమే సి.ఎం.డి లెవెల్ స్ట్రక్చర్ మీటింగ్ నిర్వహించాలన్నారు .
మెడికల్ బోర్డ్ పెట్టక ఎనిమిది నెలలు అవుతున్నా కూడా కాలయాపన చేస్తున్నారని వివరించారు. పాత పద్దతిలో వలె మెడికల్ బోర్డ్ ప్రతి నెల ఏర్పాటు చేయాలని కోరారు. కొత్త మైన్స్ వస్తున్నాయి..భారతదేశ వ్యాప్తంగా మార్పు వస్తున్నదని.. సింగరేణిలో గ్యాస్ ఫికేషన్ చేస్తామని బొగ్గుతో గ్యాస్ ఉత్పత్తి చేస్తామని చెప్తున్నప్పటికీ సింగరేణి యాజమాన్యం మ్యాన్ పవర్ పెంచే ఆలోచన చేయడం లేదని విమర్శించారు. సత్తుపల్లిలో అవంతిక కంపెనీ కొన్నేళ్లుగా పనిచేస్తున్న నేపథ్యంలో, ప్రస్తుతం నడిపే పరిస్థితి లేదన్నారు.
కంపెనీకి డబ్బులిచ్చి సింగరేణి యాజమాన్యం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇల్లందు కోయగూడెం ఓసి అరబిందో కంపెనీ కి ఇచ్చారని, దానిపై కోర్టుకు వెళ్లారని..వన్ ఆఫ్ సెవెంటీ ప్రకారం ప్రభుత్వం, లేదా సింగరేణి సంస్థ నడపాలని కోర్టుకు వెళ్లారని తెలిపారు. రాజస్థాన్లో పెద్ద పవర్ ప్రాజెక్టు పెట్టామని చెప్పారని ప్రస్తుత సీఎం డి దానిపై మాట్లాడటం లేదన్నారు. కర్ణాటకలో బంగారం, రాగి గనులను సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ప్రకటించారు..ప్రస్తుతం దానిపై ఊసే లేదని విమర్శించారు.
ఇతర రాష్ట్రాల్లో సింగరేణి ప్రాజెక్ట్ ల పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జెన్ కో నుంచి రావలసిన బకాయిలపై ఆలు లేదు సూలు లేదని విమర్శించారు. సింగరేణికి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలపై ప్రశ్నిస్తున్న ఎఐటియుసికి వ్యతిరేకంగా ప్రభుత్వ అనుబంధ ప్రాతినిధ్య కార్మిక సంఘం ఐఎన్టియుసి తప్పుడు ప్రచారాలతో కార్మికులను మభ్యపెడుతున్నదని విమర్శించారు. ఇంధన శాఖా మంత్రి బట్టి విక్రమార్క,సీఎం రేవంత్ త్వరలోనే పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని ఒప్పుకున్నట్లు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
మారు పేర్ల సమస్య అలాగే ఉన్నదని, కోల్ ఇండియా తరహాలో పెర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ అమలు కావడం లేదన్నారు. కేంద్రం నూతన లేబర్ కోడ్ లను సింగరేణి లో వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. సింగరేణిలో ఒక లక్ష 16 వేల మంది కార్మికులు ఉండేవారని, ప్రస్తుతం 43 వేలమంది ఉన్నారని తెలిపారు. సింగరేణి ఆధ్వర్యంలో నూతన అండర్ గ్రౌండ్ మైన్స్,ఓసీలు తీసుకు రావాలని.. కార్మికుల సంఖ్య 60 వేల నుంచి 70 పెంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు రావలసిన కనీస వేతనాలు చెల్లించడం లేదని సరైన సమయానికి ఇవ్వడం లేదని, సమ్మె చేస్తే జీతాల్లో కోత విధిస్తామని బెదిరిస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను డిమాండ్స్ పరిష్కరించాలని కోరారు.




