Khammam: సభా వేదికకు ‘పద్మశ్రీ వనజీవి రామయ్య’ ప్రాంగణంగా నామకరణం!

Khammam: సెప్టెంబర్ 13న ఖమ్మంలో జనసేన "తెలంగాణ రాష్ట్ర శంఖారావం" సభ. సభా ప్రాంగణానికి వనజీవి రామయ్య పేరు. ఉమ్మడి జిల్లా మంత్రులపై డా. గడల శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 11 Sept 2026 9:48 PM IST
Khammam
X

Khammam: సభా వేదికకు ‘పద్మశ్రీ వనజీవి రామయ్య’ ప్రాంగణంగా నామకరణం!

ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర శంఖారావం” సభను విజయవంతం చేయాలని ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జనసేన పార్టీ అభ్యర్థి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. గడల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

​శుక్రవారం ఖమ్మం కాల్వఒడ్డులోని MB గార్డెన్స్‌లో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో ప్రత్యేక ‘లంచ్ మీట్’ (Lunch Meet) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో చిట్-చాట్ మాట్లాడుతూ పలు కీలక అంశాలను వెల్లడించారు.

ఈ యొక్క సభకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి తోపాటు, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ జనసేన పార్టీ తెలంగాణ ప్రచార కార్యదర్శి రాక్. సాగర్ మరియు జనసేన పార్టీ తెలంగాణ అగ్ర నాయకులు హాజరవుతున్నారు. కాబట్టి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని జనసేన పార్టీ శ్రేణులకు గడల శ్రీనివాస రావు పిలుపునిచ్చారు.

​సభా ప్రాంగణానికి ‘వనజీవి రామయ్య ప్రాంగణం’గా నామకరణం:

సెప్టెంబర్ 13న ఖమ్మం MB గార్డెన్స్ వేదికగా నిర్వహించే జనసేన పార్టీ “తెలంగాణ రాష్ట్ర శంఖారావం” భారీ బహిరంగ సభా ప్రాంగణానికి పర్యావరణ ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత గౌరవార్థం "వనజీవి రామయ్య ప్రాంగణం" గా నామకరణం చేస్తున్నట్లు డా. గడల శ్రీనివాసరావు ప్రకటించారు.

​ఖమ్మం కేబుల్ బ్రిడ్జికి ‘వనజీవి రామయ్య వారధి’గా పేరు పెట్టాలి:

కోట్లాది మొక్కలు నాటి దేశవ్యాప్తంగా ఖమ్మం జిల్లాకు గుర్తింపు తెచ్చిన వనజీవి రామయ్య గారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని ప్రతిష్టాత్మక కేబుల్ బ్రిడ్జికి "వనజీవి రామయ్య వారధి" గా తక్షణమే ప్రభుత్వం నామకరణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

​ముగ్గురు మంత్రుల పనితీరుపై విమర్శలు:

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రుల పనితీరు నిరాశాజనకంగా ఉందని డా. గడల ధ్వజమెత్తారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని, నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉన్నా జిల్లా సమగ్ర అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు.

​పట్టభద్రుల సమస్యలపై సమరశంఖం:

నిరుద్యోగ యువత, ఉద్యోగులు, పట్టభద్రుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా జనసేన పనిచేస్తుందని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజమైన ప్రజా గొంతుకగా నిలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ శంఖారావం సభ ద్వారా పార్టీ భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

​ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు రాము యాదవ్,ఖమ్మం జిల్లా కోఆర్డినేట్ మిర్యాల రామకృష్ణ, సత్తుపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి నరేష్, జనసేన పార్టీ జిల్లా నాయకులు, జనసేన పార్టీ వివిధ విభాగాల నాయకులు, వీర మహిళలు,జనసేన పార్టీ కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.