Chintoor: చింతూరు బరిలో కవిత: ఇంటింటి ప్రచారం!

Chintoor: చింతూరు జెడ్పీటీసీ స్థానంలో జనసేన అభ్యర్థి తీగల కవిత కూటమి నేతలతో కలిసి విస్తృతంగా ప్రచారం చేస్తూ మండల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఓట్లు కోరారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 30 Oct 2026 8:22 PM IST
Chintoor
X

Chintoor: చింతూరు బరిలో కవిత: ఇంటింటి ప్రచారం!

Chintoor: చింతూరు జెడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి తీగల కవిత ప్రచారంలో దూసుకుపోతున్నారు. కూటమి నాయకులు, జనసేన శ్రేణులు ఆమెకు అండగా నిలిచి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.చింతూరు మండలంలోని పలు గ్రామాల్లో తీగల కవిత ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

ఆమె వెంట జనసేన నాయకులు బేడే సతీష్ కుమార్, ప్రవీణ్ కుమార్, సతీష్ తదితరులు ప్రచారంలో పాల్గొని కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు.ఈ సందర్భంగా తీగల కవిత మాట్లాడుతూ... తనను జెడ్పీటీసీగా గెలిపిస్తే చింతూరు మండలంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ముఖ్యంగా తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తానని, అంతర్గత రహదారుల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో నిధులు తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆమె పేర్కొన్నారు.ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR