Kothagudem: కొత్తగూడెంలో జనసేన శంఖారావం!
Kothagudem: కొత్తగూడెంలో జనసేన జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన గడల శ్రీనివాసరావు. రామ్ తాళ్లూరి, శంకర్ గౌడ్ సమక్షంలో 200 మంది యువకులు జనసేనలోకి చేరిక.
Kothagudem: కొత్తగూడెంలో జనసేన శంఖారావం!
Kothagudem: విద్యానగర్ కాలనీలో..
జనసేన పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ హెల్త్ డైరెక్టర్, జనసేన రాష్ట్ర చేరికల కమిటీ సభ్యుడు గడల శ్రీనివాసరావు..
ఈసందర్భంగా కొత్తగూడెం పట్టణంలో జనసేన కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
గడల శ్రీనివాసరావు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి , అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసారు.
జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి,గడల శ్రీనివాసరావు అధ్యక్షతన ఉమ్మడి జిల్లా కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా శ్రీనివాస రావు ఆధ్వర్యంలో జనసేన జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి,
జనసేన రాష్ట్ర అధ్యక్షులు శంకర్ గౌడ్ సమక్షంలో సుమారు రెండు వందల మంది స్థానిక యువకులు జనసేన పార్టీలో చేరారు.
ఈసందర్భంగా గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీలోకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.
తాను కొత్తగూడెం లోనే పుట్టి పెరిగిన మనిషినని, ప్రజాసేవ చేయడానికి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరానని,
జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కు ప్రజలకు ఏమి చేయాలో తెలిసిన నిబద్ధత కలిగిన నాయకుడన్నారు.
జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వం జన సైనికులకు దిశా నిర్దేశం చేసేందుకు విచ్చేసినట్టు తెలిపారు.
కొత్తగూడెం కేంద్రంగా కొత్తగూడెం బిడ్డగా సేవ చేస్తానని తెలిపారు.
రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ పెద్ద రాజకీయ శక్తిగా ఎదుగుతుందన్నారు.
బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలనుద్దేశించి మాట్లాడుతూ ఈ రెండు పార్టీలు ప్రజలకు చేసింది ఏమీ లేదని తీవ్రంగా విమర్శించారు.
హెల్త్ డైరెక్టర్ గా జి ఎస్ ఆర్ ట్రస్టు ద్వారా తాను అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.
రానున్న రోజుల్లో ప్రజల సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేస్తుందని తెలిపారు.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి మాట్లాడుతూ..
శ్రీరాముని ఆశీస్సులతో జిల్లాలో సేవ చేసే భాగ్యం కలిగించాలని.. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని తెలిపారు.
సామాజిక తెలంగాణ జనసేన పార్టీతోనే సాధ్యమని, బిసి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన పార్టీకి తాము మద్దతుగా ఉంటామన్నారు. ముఖ్యమంత్రి బీసీ అభ్యర్థి అయినప్పుడే తెలంగాణలో సామాజిక తెలంగాణ వస్తుందన్నారు.
కార్యక్రమంలో జనసేన రాష్ట్ర అధ్యక్షులు శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు రాము యాదవ్, ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్, టి శ్రీనివాసరావు, సినీ నటుడు తనీష్, హసీనా జయశ్రీ, ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ మిర్యాల రామకృష్ణ ,నరేష్ ,సాదిక్, జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.




