Khammam: ఖమ్మంలో 13న జనసేన శంఖారావం సభ!
Khammam: ఈనెల 13న ఖమ్మంలో జనసేన శంఖారావం సభ. ఇల్లందులో బైక్ ర్యాలీ చేపట్టిన ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు. బిఆర్ఎస్, కాంగ్రెస్‌లపై ఘాటు విమర్శలు.
Khammam: ఖమ్మంలో 13న జనసేన శంఖారావం సభ!
Khammam: ఈనెల 13న ఖమ్మంలో నిర్వహించనున్న జనసేన శంఖారావం సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నియోజకవర్గాల నుంచి వేలాదిగా జనసైనికులు తరలిరావాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు తెలిపారు.శనివారం ఇల్లందులో జన సేన ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించిచారు.
అనంతరం జరిగిన సమావేశం లో గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆంధ్ర పార్టీ అని కొన్ని పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారని కానీ జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణలో అని తెలిపారు. సింగరేణికి పుట్టినిల్లుఅయినా ఇల్లందు ప్రాంతం వెలుగులు ఇవ్వగా ఈరోజు అభివృద్ధి లేక చీకట్లో ఉందన్నారు. అక్టోబర్ లో గ్రామ మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
బంగారు తెలంగాణ చేస్తామన్న బిఆర్ఎస్, ప్రజా పాలన అని చెప్పిన కాంగ్రెస్ హామీలను విస్మరించారని తెలిపారు.అనంతరం పలు పార్టీల నుండి జనసేన లో చేరారు. ఈ కార్యక్రమం లో ఇల్లందు నియోజకవర్గ ఇంచార్జి నాగ స్రవంతి పలువురు నాయకులు పాల్గొన్నారు.




