Palwancha: పాల్వంచ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా జర్నలిస్టుల దినోత్సవ వేడుకలు!

Palwancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రెస్ క్లబ్‌లో జర్నలిస్టుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 6 Sept 2026 11:09 PM IST
Palwancha
X

Palwancha: పాల్వంచ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా జర్నలిస్టుల దినోత్సవ వేడుకలు!

పాల్వంచ, సెప్టెంబర్ 6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో ఆదివారం జర్నలిస్టుల దినోత్సవ వేడుకలను పాత్రికేయులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పాత్రికేయుల రక్షణకు ప్రత్యేక చట్టాలు అమలు చేయాలని, ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అబ్బురం, సెక్రటరీ సంగీతం లెనిన్, ఉపాధ్యక్షుడు జగదీష్, సీనియర్ జర్నలిస్టులు నరసింహారావు, సంజీవ్, శ్రీనివాసరావు, కృష్ణమూర్తి, పుల్లారావు, పవన్ కుమార్, సందీప్, కిషోర్, ఫణి, నాగరాజు తదితరులతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

Next Story