Palvancha: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యే కు వినతి!
Palvancha: క్యాంప్ ఆఫీసులో జర్నలిస్టులు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిసి పాల్వంచ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వినతిపత్రం ఇచ్చారు.
Palvancha: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యే వినతి!
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో విధులు నిర్వహిస్తున్న అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ బుధవారం సాయంత్రం జర్నలిస్టులు కొత్తగూడెం క్యాంప్ కార్యాలయంలో MLA కూనంనేని సాంబశివరావు ను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో గుర్తింపు పొందిన జర్నలిస్టులు ఉన్నారని, వారిలో అధిక శాతం మంది అద్దె ఇళ్లలోనే ఉంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రభుత్వం ఇతర జిల్లాల్లో జర్నలిస్టులకు స్థలాలు కేటాయించిన విధంగా ఇక్కడ కూడా జర్నలిస్టుల కోసం ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.
జర్నలిస్టుల సమస్యను సానుకూలంగా స్వీకరించిన MLA కూనంనేని సాంబశివరావు ఈ అంశంపై తప్పకుండా కృషి చేస్తానని, సంబంధిత అధికారులతో చర్చించి త్వరలో పరిష్కార మార్గం చూపుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శి తో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.




