Julurpad: అర్ణబ్ తుఫాన్ అలర్ట్.. జూలూరుపాడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

Julurpad: అర్ణబ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జూలూరుపాడు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో తాలూరు రవి హెచ్చరించారు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 28 Oct 2026 10:24 AM IST
Julurpad
X

Julurpad: అర్ణబ్ తుఫాన్ అలర్ట్.. జూలూరుపాడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

Julurpad: జూలూరుపాడు మండల ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా, అర్ణబ్ తుఫాన్ ప్రభావంతో ఈ రోజు రాత్రి నుండి అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.

ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. విద్యుత్ స్తంభాలు, చెట్లు, శిథిలావస్థలో ఉన్న భవనాలకు దూరంగా ఉండాలి. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున వాటిని దాటే ప్రయత్నం చేయకూడదు.

ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ, అధికారుల సూచనలు పాటించాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యం. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU