Julurpad: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి!
Julurpad: జూలూరుపాడు MPDO ఆఫీస్‌లో ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. MPDO తాళ్లూరి రవి, MPO తులసి రామ్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
Julurpad: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి!
ప్రెస్ నోట్
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహింపు
జూలూరుపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ సిద్ధాంతకర్తగా, విద్యావేత్తగా, సమాజ చైతన్యవేత్తగా ఆచార్య జయశంకర్ అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి తాళ్లూరి రవి(ఎంపీడీవో), మండల పంచాయతీఅధికారి తులసి రామ్ (ఎంపీఓ), కార్యాలయ సిబ్బంది పాల్గొని ఆచార్య జయశంకర్‌కు ఘన నివాళులు అర్పించారు.
Next Story




