Julurpadu: వర్షాభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి AIUKS

Julurpadu: జూలూరుపాడు మండలంలో వర్షాభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన అఖిలభారత ఐక్య రైతు సంఘం.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 4 Aug 2026 9:20 PM IST
Julurpadu
X

Julurpadu: వర్షాభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి AIUKS

జూలూరుపాడు: వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాల ఏఐయుకేఎస్ డిమాండ్. ది నాలుగు ఆగస్టు 2026 మంగళవారం నాడు స్థానిక జూలూరుపాడు మండల తాసిల్దార్ గారికి అఖిలభారత ఐక్య రైతు సంఘం జూలూరుపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మెమోరాండం ఇస్తున్న దృశ్యం.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శ బానోతు ధర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో వర్షాలు సకాలంలో సజావుగా ఉంటాయని వాతావరణ నింపుణులు ప్రభుత్వ ప్రకటనతో రాష్ట్ర రైతాంగం ఆనందంగా సాగుకు సిద్ధపడ్డారు కానీ ఆచరణలో అక్కడక్కడ స్వల్ప జల్లులు పడటమే రాష్ట్ర రైతాంగం ఆనందంతో సాగుకు సిద్ధపడ్డారు కానీ ఆచరణలో ఎండ తీవ్రత వాతావరణం అనుకూలించక రైతులు వేసిన పంటలు ఎండ తీవ్రతకు మాడిపోయి నష్టపోయినారు.

నష్టపోయిన రైతాంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం కలిపించి రైతాంగాన్ని భరో సా ఇచ్చి రైతాంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి వారు డిమాండ్ చేశారు ఈ పరిస్థితిలో రైతులకు అనువైన సాగుకు అన్ని రకాల విత్తనాలు ఉచితంగా సప్లై చేయాలని గత సంవత్సరం రైతుల రుణాలను మాఫీ చేసి ప్రస్తుత ఈ సంవత్సరం పంటకు రుణాలు ఇవ్వాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం మండల కార్యదర్శి తోటకూర నరేష్ నాయకులు పారుపల్లి బాబురావు ఎస్ మధు.బి .నాగేశ్వరావు నరసింహారావు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU

Next Story