Julurpadu: జూలూరుపాడులో నూతన గ్రంథాలయ ఏర్పాటుకు శ్రీకారం!
Julurpadu: జూలూరుపాడు మండలంలో నూతన గ్రంథాలయ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఐటీడీఏ పీఓ రాహుల్, ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సహకారంతో ఇది సుగమమైంది.
Julurpadu: జూలూరుపాడులో నూతన గ్రంథాలయ ఏర్పాటుకు శ్రీకారం!
జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆధ్వర్యంలో జూలూరుపాడు మండలంలో నూతన గ్రంథాలయ ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషకరమైన విషయం.
విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే సంకల్పంతో, గ్రంథాలయాల అభివృద్ధికి జిల్లా కేంద్ర గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు నిరంతరం అహర్నిశలు కృషి చేస్తున్నారు. తన శక్తివంచన లేకుండా గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తూ, విద్యార్థులకు మరియు నిరుద్యోగ యువతకు మెరుగైన పఠన వసతులు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
ఐటీడీఏ పీవో రాహుల్ సహకారం, ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చొరవతో జూలూరుపాడు మండలంలో నూతన గ్రంథాలయ ఏర్పాటుకు మార్గం సుగమం కావడం అభినందనీయం. గ్రంథాలయ కార్యదర్శి ఆధ్వర్యంలో గ్రంథాలయ అభివృద్ధికి చేపడుతున్న చర్యలు మరింత ప్రోత్సాహకరంగా ఉన్నాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్య, విజ్ఞానం, గ్రంథాలయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందుకు సాగడం హర్షణీయం.
నూతన గ్రంథాలయం అందుబాటులోకి వస్తే విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో విజ్ఞానాన్ని విస్తరించడంతో పాటు యువత ఉజ్వల భవిష్యత్తుకు ఈ గ్రంథాలయం ఒక చక్కని వేదికగా నిలుస్తుందని ఆశిద్దాం.
గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తున్న చైర్మన్ కు సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు హృదయపూర్వక అభినందనలను గ్రంథాలయ కార్యదర్శి కేకరణకుమారి తెలియజేశారు.




