Julurupadu: బాలికల వసతి గృహాలకు మహిళా వాచ్మెన్లను నియమించాలి

Julurupadu: జూలూరుపాడు మండలం నర్సాపురం బాలికల గిరిజన వసతి గృహం, పీఎంహెచ్ హాస్టల్‌కు తక్షణమే మహిళా వాచ్మెన్లను నియమించాలని ఏఐఎస్ఎఫ్ నేత గుగులోతు వంశీ డిమాండ్ చేశారు.

SK MAHABOOB JANI, JULURPADU
Updated on: 15 Nov 2026 8:39 PM IST
Julurupadu
X

Julurupadu: బాలికల వసతి గృహాలకు మహిళా వాచ్మెన్లను నియమించాలి

జూలూరుపాడు: అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్) జూలూరుపాడు మండల సమితి ఆధ్వర్యంలో మండల పరిధిలోని పలు హాస్టల్ లను ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి సభ్యులు అనిల్ కుమార్ అధ్యక్షతన సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ పాల్గొని మాట్లాడుతూ జూలూరుపాడు మండల పరిధిలోని నరసాపురం గ్రామంలో ఉన్న బాలికల వసతి గృహాన్ని మరియు పీఎంహెచ్ హాస్టల్ ని సందర్శించారు.

అనంతరం వంశీ విద్యార్థులతో మాట్లాడే పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు . ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేసింది వారు ఆరోపించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో నైట్ డే వాచ్మెన్లు లేకపోవడం వల్ల విద్యార్థుల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేద వ్యక్తం చేశారు.

జూలూరుపాడు మండల పరిధిలోని నరసాపురం గ్రామంలో ఉన్న రెండు హాస్టల్లో బాలికల వసతి గృహాల్లో మగవారిని వాచ్మెన్ కాకుండా మహిళను నియమించాలని అనేకసార్లు అధికారులకు తెలియజేసిన అధికారులు స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మగవారి కాకుండా మహిళ వా పగలు రాత్రి మహిళా వాచ్మెన్ లో నియమించాలని ఐటీడీ అధికారుల డిమాండ్ చేశారు లేనిపక్షంలో విద్యార్థి తల్లిదండ్రులు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తామని ప్రభుత్వాన్ని వంశీ హెచ్చరించారు.

అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్వీణం చేయడానికి కుట్రలు చేసిందని వారు ఆరోపించారు తక్షణమే. ప్రభుత్వ విద్యా రంగానికి అరాకూర నిధులతో విద్యారంగం ఎలా అభివృద్ధి చెందుతుందని వారు ప్రశ్నించారు .తక్షణమే విద్యారంగని కావాల్సింది కేటాయించి విద్యారంగాన్ని పూర్తిస్థాయిల అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేశారు.

తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యను పరిష్కరించని డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమానికి పిలుపునిస్తాం హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు బాలాజీ మండల నాయకులు అఖిల్ , లితికేష్, హాస్టల్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు లిఖిత, శిరీష సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU