Julurupadu: బస్ షెల్టర్ లేదు.. టాయిలెట్స్ లేవు.. జూలూరుపాడులో మహిళల నానా అవస్థలు!

Julurupadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో రెండు సార్లు శంకుస్థాపన చేసినా బస్ షెల్టర్, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలు ప్రారంభం కాలేదు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 17 May 2026 5:06 PM IST
Julurupadu
X

Julurupadu: బస్ షెల్టర్ లేదు.. టాయిలెట్స్ లేవు.. జూలూరుపాడులో మహిళల నానా అవస్థలు!

Julurupadu: జూలూరుపాడు మండల కేంద్రంలోని ఎంతోకాలంగా ప్రజలు విద్యార్థులు ప్రధానంగా మహిళలు పబ్లిక్ టాయిలెట్స్ బస్ షెల్టర్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వెంటనే బస్ షెల్టర్లను పబ్లిక్ టాయిలెట్లను నిర్మాణాలు చేపట్టాలని గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు బానోత్ మధు డిమాండ్ చేశారు ఈ సమస్యపై అనేకమార్లు ఎంపీడీవో ఎమ్మార్వో అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు రామదాసు నాయక్ గారి దృష్టికి తీసుకువెళ్లటం జరిగింది తీసుకువెళ్లిన సందర్భంలో ఒకటికి రెండుసార్లు శంకుస్థాపన చేశారు కానీ అవి శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి తప్ప పనులు మాత్రం జరగకపోవడం చాలా బాధాకరమని అన్నారు మండల కేంద్రంలోని ప్రభుత్వానికి సంబంధించిన సుమారు రెండు కుంటలు భూమి కూడా ఉన్నదని అన్నారు.

జూలూరుపాడుకు ప్రతిరోజు ప్రజలు విద్యార్థులు మహిళలు తమ అవసరాల నిమిత్తం వస్తూ ఉంటారు ఎండలు వర్షాలు వచ్చే సమయంలో వాళ్లు కనీసం నిలబడాలన్న నిలబడటనికి కూడా అవకాశం లేకుండా పోయింది అదేవిధంగా ఏదైనా అవసరం ఉండే టాయిలెట్స్ కి వెళ్ళాలి అన్న కనీసం పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడంతో నానా అవస్థలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు శంకుస్థాపన చేసినప్పటికీ అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయి తప్ప కొంచమైన మట్టి తీసిన పాపాన పోలేదు అధికారులు ఆ కొద్దీ సేపే హడావుడి చేస్తున్నారే తప్ప తరువాత కనీసం వాటి వైపు చూడక పోలేదన్నారు కనీసం తాత్కాలిక షెడ్లను కూడా నిర్మించకపోవడం దురదృష్టకరమని అన్నారు ఎమ్మెల్యే దీనిపై దృష్టి సారించి వెంటనే టాయిలెట్స్ బస్సు షెల్టర్లను వెంటనే నిర్మాణాలు చేపట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU

Next Story