Julurupadu: నాటిన ప్రతి మొక్కను బతికించడం సామాజిక బాధ్యత: ఎంపీడీవో రవి
Julurupadu: నాటిన ప్రతి మొక్కను బతికించడం సామాజిక బాధ్యత: ఎంపీడీవో రవి
Julurupadu: నాటిన ప్రతి మొక్కను బతికించడం సామాజిక బాధ్యత: ఎంపీడీవో రవి
జూలూరుపాడు: జూలూరుపాడు మండలంలో ఘనంగా వనమహోత్సవం – ఆర్ & బి రోడ్డుకు ఇరువైపులా ఏవిన్యూ మొక్కల నాటకం జూలూరుపాడు మండలంలోని జూలూరుపాడు పంచాయతీ గ్రామ పరిధిలో పాపకొల్లు రోడ్డు ఆర్ & బి రోడ్డుకు ఇరువైపులా ఈరోజు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటించారు. పర్యావరణ పరిరక్షణ, హరితహారం పెంపు మరియు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో తాళ్లూరు రవి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించడం సామాజిక బాధ్యతగా భావించాలని, నాటిన ప్రతి మొక్కను బతికించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. పచ్చదనం పెంపొందితేనే పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీఓ రామారావు, ఈసీ సైదులు, టీఏ నాగమణి మరియు ఉపాధి హామీ పథకం సిబ్బంది పాల్గొని మొక్కలు నాటి వాటి సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.




