Julurupadu: జూలూరుపాడు పీఏసీఎస్ పరిధిలో మొక్కజొన్న కొనుగోళ్లు విజయవంతం: గోదాములకు 14,933 క్వింటాళ్ల నిల్వల తరలింపు!
Julurupadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పీఏసీఎస్ (PACS) పరిధిలో మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.
జూలూరుపాడు: జూలూరుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) జూలూరుపాడు పరిధిలో మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని సొసైటీ చైర్మన్ కొమ్మినేని పాండురంగారావు ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరకే కొనుగోలు చేశామని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన 29866 బస్తాలు 14933 క్వింటాలు మొక్కజొన్న నిల్వలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తక్షణమే గోదాములకు (Godowns) తరలించారు అధికారుల్ని జిల్లా సహకార అధికారైన ఏ శ్రీనివాస్ సార్ గారు మరియు జూలూరుపాడు ఎమ్మార్వో గార్ల కీ చైర్మన్ గారు కృతజ్ఞతలు తెలిపారుఅలాగే సిబ్బంది కీ అభినందనలు తెలురాజేశారు . రానున్న వాతావరణ మార్పులు, వర్షాల ముప్పును దృష్టిలో ఉంచుకుని, లోడింగ్ మరియు రవాణా ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా వంద శాతం త్వరితగతిన తరలించి పూర్తి చేశారని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పేమెంట్స్ ప్రక్రియ కూడా వేగవంతం చేస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు.




