Julurupadu: ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌నకు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ఎంపిక!
Julurupadu: కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జాతీయ ప్రతిభ ఉపకార వేతన స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యారు.
Julurupadu: ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌నకు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ఎంపిక!
Julurupadu: జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు జాతీయ ఆదాయ ఆధారిత ప్రతిభ ఉపకార వేతన పథకం స్కాలర్షిప్ కు ఎంపిక అయ్యారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీరా సాహెబ్ తెలిపారు.
పాఠశాలకు చెందిన బి. వర్షిత, కె. మేఘన, జి. కృష్ణ మనోహర్ ముగ్గురు విద్యార్థులు NMMS పరీక్షలు ఉత్తీర్ణత సాధించడం పాఠశాలకు ఎంతో గర్వకారణమని ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థినీ విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోపాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గ్రామస్తులు అభినందించారు.
ప్రభుత్వ పాఠశాల నుండి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ కు ఎంపిక రావడం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థికి 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రతి సంవత్సరం రూ 12000 చొప్పున స్కాలర్షిప్ పొందేందుకు అర్హత సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. విద్యార్థినీ విద్యార్థులు సాధించిన ఈ విజయానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు.




