Kallur: కల్లూరు ఆర్.ఎస్‌లో శాకంబరి రూపంలో వాసవి అమ్మవారు!
Kallur: కల్లూరు ఆర్.ఎస్‌లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శాకంబరి అలంకరణ చేశారు. వివిధ రకాల కూరగాయలు, ఫలాలతో అమ్మవారిని శోభాయమానంగా తీర్చిదిద్దారు.
Kallur: కల్లూరు ఆర్.ఎస్‌లో శాకంబరి రూపంలో వాసవి అమ్మవారు!
కల్లూరు: ఆర్.ఎస్ లో శాఖంబరి అలంకరణలో వాసవి అమ్మవారు
- కూరగాయలు, పళ్ళ మాలలతో ప్రత్యేక అలంకరణ
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు ఆర్.ఎస్ గ్రామంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆదివారం శాఖంబరి అలంకరణ కన్నుల పండుగగా జరిగింది.
ఉదయం అర్చకులు అమరేంద్ర స్వామి అమ్మవారికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, పళ్ళ మాలలతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు.
శాఖంబరి దేవి రూపంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు కుంకుమ అర్చన చేసి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
చివరగా మహా మంగళ హారతి గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.




