Khammam: తిమ్మరావుపేటలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి!
Khammam: కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఐపీఎస్ ఆదేశాలతో తిమ్మరావుపేటలో పేకాట స్థావరంపై దాడి ఏడుగురు అరెస్ట్ రూ.4,870 నగదు, 4 ఫోన్లు, 52 పేకముక్కలు స్వాధీనం.
Khammam: తిమ్మరావుపేటలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి!
ఖమ్మం: కల్లూరు సబ్-డివిజన్, ఖమ్మం ఏసీపీ వసుంధర యాదవ్, IPS గారి ఆదేశాల మేరకు ఏన్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మరావుపేట గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు. ఈరోజు సాయంత్రం సుమారు 5:00 గంటల సమయంలో తిమ్మరావుపేట గ్రామంలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి ₹4,870 నగదు, 52 పేకముక్కలు, నాలుగు సెల్‌ఫోన్లను పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి చట్ట ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు ఏసీపీ వసుంధర యాదవ్, IPS తెలిపారు. డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడటం లేదా ఇటువంటి పేకాట స్థావరాలను నిర్వహించడం చట్టపరంగా నేరమని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




