Kalluru: సీతారామ భూసేకరణ వేగవంతం చేయాలి
Kalluru: సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూసేకరణ, అవార్డు విచారణ, ఆస్తుల మదింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆదేశించారు.
Kalluru: సీతారామ భూసేకరణ వేగవంతం చేయాలి
కల్లూరు: సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (SRLIP) భూసేకరణకు సంబంధించి సబ్ కలెక్టర్, కల్లూరు శ్రీ అజయ్ యాదవ్, ఐఏఎస్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ పురోగతిని సమీక్షించడంతో పాటు, అవార్డు విచారణ (Award Enquiry) నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, భూసేకరణకు సంబంధించిన వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా భూసేకరణకు సంబంధించిన భూముల్లో ఉన్న చెట్లు, బావులు, ఇతర నిర్మాణాలు తదితర ఆస్తుల వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, వాటి విలువను నిబంధనల ప్రకారం శాస్త్రీయంగా మదింపు చేయాలని అధికారులకు సూచించారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, చెట్లు మరియు నిర్మాణాలకు సంబంధించిన విలువ నిర్ధారణ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు.




