Kandukuru: అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో విద్యార్థుల విజ్ఞాన యాత్ర

Kandukuru: కందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజ్ఞాన యాత్రలో భాగంగా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలను సందర్శించి ఆధునిక సాగు పద్ధతులు తెలుసుకున్నారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 25 Oct 2026 4:29 PM IST
Kandukuru
X

Kandukuru: అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో విద్యార్థుల విజ్ఞాన యాత్ర

కందుకూరు: ఈ రోజు కందుకూరు జిల్లా పరిషత పాఠశాల నుంచి 6వ తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న 200 మంది విద్యార్థులు విజ్ఞాన యాత్రలో భాగంగా అశ్వారావుపేట నందు ఉన్న వ్యవసాయ కళాశాలను సందర్శించటం జరిగినది. మొదటగా విద్యార్థులు మరియు వారి వెంబడి వచ్చిన అధ్యాపకులు వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా.హేమంత్ కుమార్ గారిని కలిసి విజ్ఞాన యాత్ర గురించి చర్చించటం జరిగినది.

తరువాత డా.హేమంత్ కుమార్ విద్యార్థులకు వ్యవసాయ కళాశాలలో పండిస్తున్న వివిధ వ్యవసాయ పాటలు మరియు ఉద్యాన పంటల సాగు పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం , ప్రదర్శన క్షేత్రాలు మరియు వినూత్న వ్యవసాయ విధానాలపై అవగాహనా కల్పించటం జరిగినది. తరువాత విద్యార్థులు వివిధ పంటల సాగు విధానాలను ప్రదర్శన క్షేత్రాలను సందర్శించి శాస్త్రీయ సాగు విధానాలను తెలుసుకున్నారు.

అదేవిదంగా డా. నేను. నాగంజలి, డా. శ్రీనివాస రావు, బి. శివ, డా. శ్రావిక విద్యార్థులకు వివిధ చిరుధాన్యాల పంటలు, పందిరిలో కూరగాయల సాగు విధానాలు, వివిధ కూరగాయల పంటల్లో మల్చింగ్, సూక్ష్మ నీటిపారుదల, ఫెర్టిగేషన్, వివిధ పూల పంటల సాగు విధానాలు, కొబ్బరి మరియు ఆయిల్ పామ్ లో వివిధ అంతర పంటల సాగు మరియు ప్రకృతి విధానంలో కూరగాయల సాగు విధానాలు తెలియపరిచారు.

విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాలలో జీవనోపాధి అవకాశంగా పుట్టగొడుగులు పెంపకం యూనిట్, వానపాముల తయారీ యూనిట్ మరియు మట్టి పరీక్షా విధానం గురించి తెలిపారు. విద్యార్థులు మరియు అధ్యాపకులు ఈ కళాశాల నందు ఉన్న ప్రదర్శన క్షేత్రాలు మరియు పంటల సాగు క్షేత్రాలు పట్ల చాల సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఇలాంటి ప్రదర్శన క్షేత్రాలు విద్యార్థులకు చాల ఉపయోగకరంగా నిలిచిందని చెప్పటం జరిగినది.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA