Khammam: ఖమ్మంలో కార్పొరేటర్ - మున్సిపల్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం
Khammam: ఖమ్మం 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సరిపూడి రమాదేవి - సతీష్ దంపతులు తమ పదవీకాలం ముగిసిన సందర్భంగా మున్సిపల్ కార్మికులతో కలిసి వేడుక చేసుకున్నారు.
Khammam: ఖమ్మంలో కార్పొరేటర్ - మున్సిపల్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం
Khammam: 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సరిపూడి రమాదేవి - సతీష్ గారి దంపతులు 5 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా డివిజన్ మున్సిపల్ కార్మికులు మంగళవారం ఘనంగా సత్కరించారు.
కార్మికులు కేక్ కటింగ్ చేసి, శాలువాలతో సన్మానించగా, దానికి ప్రతిగా కార్పొరేటర్ దంపతులు డివిజన్‌లో పారిశుధ్య పనులు, కాలువలు, రోడ్ల శుభ్రత కోసం పని చేస్తున్న కార్మికులందరికీ శాలువాలు కప్పి సత్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, "డివిజన్ అభివృద్ధిలో, పరిశుభ్రతలో కార్మికుల పాత్ర కీలకం. వారి సహకారంతోనే 5 ఏళ్లు విజయవంతంగా పని చేయగలిగాం" అని కార్పొరేటర్ దంపతులు తెలిపారు. పదవి లేకున్నా ప్రజాసేవ కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.
Next Story




