Khammam: ఖమ్మంలో అక్రమంగా తరలిస్తున్న 33 గోవులు, దూడలు పట్టివేత
Khammam: ఖమ్మం రూరల్ మండలం అరేంపుల వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 33 గోవులను పట్టుకున్నారు.
Khammam: ఖమ్మంలో అక్రమంగా తరలిస్తున్న 33 గోవులు, దూడలు పట్టివేత
ఖమ్మం: ఖమ్మం రూరల్ మండలం అరేంపుల వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి నిర్వహించిన వాహన తనిఖీల్లో గోవుల అక్రమ రవాణా వెలుగులోకి వచ్చిందని, ఎలాంటి అనుమతులు లేకుండా డీసీఎం వాహనంలో 33 గోవులను అక్రమంగా తరలిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు.
33 గోవులతో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ తెలిపారు. పట్టుబడిన నలుగురు నిందితులను తదుపరి విచారణ నిమిత్తం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు మరో ఐదుగురు పరారీ ఉన్నట్లు వెల్లడించారు.




