Khammam: డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన ఖమ్మం ఆర్యవైశ్య ప్రముఖులు
Khammam: కాంగ్రెస్ వాణిజ్య విభాగం ఖమ్మం జిల్లా చైర్మన్‌గా గ్రంధి ప్రవీణ్ కుమార్ నియమితులైన సందర్భంగా ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆర్యవైశ్య ప్రముఖులు కలిశారు.
Khammam: డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన ఖమ్మం ఆర్యవైశ్య ప్రముఖులు
Khammam: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు గురువారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం ఖమ్మం జిల్లా చైర్మన్‌గా గ్రంధి ప్రవీణ్ కుమార్ నియమితులైన సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఖమ్మం జిల్లాలోని మధిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉప ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు గ్రంధి ప్రవీణ్ కుమార్ పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.




