Khammam: ఖమ్మంలో ఆర్యవైశ్యుల వనభోజనాలను విజయవంతం చేయండి

Khammam: ఖమ్మం చెరుకూరి మామిడి తోటలో ఆర్యవైశ్యుల వనసమారాధన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా కుటుంబ సమేతంగా తరలిరావాలని గుమ్మడవెల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 28 Nov 2026 11:57 PM IST
Khammam
X

Khammam: ఖమ్మంలో ఆర్యవైశ్యుల వనభోజనాలను విజయవంతం చేయండి

ఖమ్మం: ఖమ్మం నగరంలో ఆదివారం చెరుకూరి మామిడి తోటలో ఆర్యవైశ్య సంఘం , వాసవి కన్యకా పరమేశ్వరి అన్నసత్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆర్యవైశ్యుల వనసమారాధన (వనభోజనాల) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గుమ్మడవెల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి ఆర్యవైశ్య సోదర సోదరీమణులు , కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో హాజరై ఐక్యతను చాటాలని కోరారు . ఆర్యవైశ్యుల మధ్య సోదరభావం , ఆత్మీయత , ఐక్యతను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు . ప్రతి ఒక్కరూ భాగస్వాములై వనసమారాధన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు .

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.